Politicsసంగారెడ్డి

స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డుకు సంగారెడ్డి 31వ వార్డు ఎంపిక.. కౌన్సిలర్ సతీష్ రెడ్డిని సన్మానించిన జగ్గారెడ్డి, నిర్మల!

సంగారెడ్డి, సెప్టెంబర్ 08 (V PRIME NEWS):సంగారెడ్డి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ-2026’లో సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డుతో పాటు వార్డు అభివృద్ధి కోసం రూ.10 లక్షల రూపాయల భారీ నగదు రివార్డు కూడా లభించింది.

కౌన్సిలర్‌కు ఘన సన్మానం: రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి మున్సిపాలిటీకి గుర్తింపు తెచ్చి, రివార్డు సాధించిన సందర్భంగా 31వ వార్డు కౌన్సిలర్ జగ్గరి సతీష్ రెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

అవార్డు రావడానికి ముఖ్య కారణాలు ఇవే:

వార్డులో చేపట్టిన పక్కా ప్రణాళికల వల్లే ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా, వార్డులో 100 శాతం ఇళ్ల నుంచి చెత్త సేకరించడం (Door to Door Collection). 60 శాతానికి పైగా తడి, పొడి చెత్తను వేరు చేయడం (Source Segregation). వార్డు వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం (Green Development). ప్రతి వీధిలో ఎప్పటికప్పుడు డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేపట్టడం వంటి అంశాలను పరిశీలించి కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ జగ్గరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. అవార్డు సాధించేందుకు సహకరించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్‌తో పాటు మున్సిపల్ అధికారులకు, ముఖ్యంగా 31వ వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రివార్డు డబ్బులను వార్డును మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఖర్చు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది, వార్డు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *