సంగారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలే మేలు

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ కు మట్టి వినాయక విగ్రహం అందజేసిన బీఆర్‌ఎస్‌వీ నాయకులు

సంగారెడ్డి, సెప్టెంబర్ 09 (V PRIME NEWS):

కలెక్టర్ ప్రతీక్ జైన్ కు మట్టి విగ్రహాన్ని అందజేస్తున్న బీ.ఆర్.ఎస్.వి నాయకులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ ను బీఆర్‌ఎస్‌వీ నాయకులు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని వారు కలెక్టర్‌ ను కోరారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో ప్రజలు పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు. మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను అభినందించారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసద్, అడ్నాన్, సబీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *