సంగారెడ్డి

కాళోజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్‌ ఘన నివాళులు

సంగారెడ్డి, సెప్టెంబర్ 9, V PRIME NEWS:

తెలంగాణ ప్రజా కవి, పద్మ విభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్‌ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి, తెలంగాణ ఉద్యమానికి కాళోజీ నారాయణరావు అక్షరయోధుడిగా నిలిచారని నిలిచారని అన్నారు. తెలంగాణ యాసలో తన కవితా భావాలను సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో వ్యక్తీకరించి, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని పేర్కొన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాళోజీ నారాయణరావు పోరాటం చేశారస్వాతంత్ర్య ఉద్యమంలోనూని, తెలంగాణ ఉద్యమాలతో పాటు చురుకుగా పాల్గొన్నారని ఎస్పీ తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా ఆయన సేవలను కొనియాడారు.
తెలంగాణ భాష, యాసపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా కాళోజీ గళం విప్పి, కలం ఎత్తారని ఎస్పీ పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని ‘తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్, డానియెల్‌తో పాటు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *