సంగారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

సంగారెడ్డి, సెప్టెంబర్ 14 (V PRIME NEWS ప్రతినిధి): సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాలు సమర్పించి స్వామివారి ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, చింత సాయినాథ్, కొండల్ రెడ్డి, విఠల్, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, శ్రవణ్ రెడ్డి, హరి ప్రసాద్, రవి తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

(Journalist – Rapaka VijayaRaju)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *