సంగారెడ్డి

క్షయ నివారణలో విద్యార్థులే కీలక భాగస్వాములు

గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు శిక్షణ — జిల్లా క్షయ కార్యక్రమ అధికారి డాక్టర్ అరుణ కుమారి

సంగారెడ్డి, సెప్టెంబర్ 10, V PRIME NEWS:

సంగారెడ్డి జిల్లాలో క్షయ వ్యాధి (టీబీ) నివారణకు విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా క్షయ కార్యక్రమ అధికారి డాక్టర్ అరుణ కుమారి సూచించారు. క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

మంగళవారం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిర్వహించిన ‘క్షయ వ్యాధి గురించి తెలుసుకోండి’ కార్యక్రమంలో విద్యార్థులకు క్షయ వ్యాధి, దాని నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ అరుణ కుమారి మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థులు సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటారని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విద్యార్థులను వాలంటీర్లుగా నమోదు చేసి, సమాజంలో ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఏఎన్‌ఓ విజయ, ఎన్‌సీసీ అధికారి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

( Journalist –  Rapaka VijayaRaju )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *