సంగారెడ్డి

ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు

అక్టోబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్వహణ.. గంధం ఊరేగింపు, కవి సమ్మేళనం, ఖవ్వాలి, అన్నదాన కార్యక్రమాలు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, (V PRIME NEWS):

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, (V PRIME NEWS): సంగారెడ్డి శివారులోని ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలను అక్టోబర్ 1, 2 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇర్ఫాని దర్గా పీఠాధిపతి ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉర్సు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

అక్టోబర్ 1న గంధం ఊరేగింపు, కవి సమ్మేళనం ఉర్సు ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన గంధం ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. అనంతరం అఖిల భారత కవి సమ్మేళనం నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కవులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 2న దీపారాధన, ఖవ్వాలి, అన్నదానం అక్టోబర్ 2వ తేదీన దీపారాధన, ఖవ్వాలి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉర్సు ఉత్సవాలకు వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉమర్ బీన్ అహ్మద్ తెలిపారు. ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో అన్వర్, అహ్మద్ ఇర్ఫాని మహమ్మద్, నూమాన్ తదితరులు పాల్గొన్నారు.

(Journalist – Rapaka VijayaRaju)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *