మంజీరా ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించిన కౌన్సిలర్ జగన్
సంగారెడ్డి పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి శుద్ధి ప్రక్రియపై క్షేత్రస్థాయిలో పరిశీలన
సంగారెడ్డి, నవంబర్ 5 | V PRIME NEWS

సంగారెడ్డి, నవంబర్ 5 | V PRIME NEWS: పట్టణ ప్రజలకు మంజీరా జలాల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి శుద్ధి ప్రక్రియను 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొండాపురం జగన్ బుధవారం పరిశీలించారు.
మంజీరా ఫిల్టర్ బెడ్‌ను సందర్శించి నీటిని శుద్ధి చేసే విధానం, ఫిల్టరేషన్ యంత్రాలు, పైపులైన్లు, ఇతర పరికరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
సంగారెడ్డి పట్టణ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
V PRIME NEWS | ప్రజల కోసం… ప్రజల గొంతుక!
