వినాయక చవితి సందర్భంగా 50కి పైగా గణపతి ఆలయాల్లో అన్నదానం
తోపాజీ అనంత కృష్ణ ఆధ్వర్యంలో 3,600 మందికి అన్న ప్రసాదం


సంగారెడ్డి, సెప్టెంబర్ 12, V PRIME NEWS: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంత కృష్ణ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పలు గణపతి ఆలయాలు, వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 3,600 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.వీర హనుమాన్ మందిరం–సదర్ మార్కెట్, సాయిబాబా మందిరం–ఆనంద్ ఆర్ట్స్ వెనుక, వాసవి క్లబ్–విద్యానగర్ కాలనీ, సాయిబాబా మందిరం–ప్రశాంత్‌నగర్ కాలనీ, బాలాజీ మందిరం–వైభవ్ రోడ్, రోటరీ క్లబ్ (కమ్యూనిటీ), వీరభద్ర ఆలయం–కొత్త బస్టాండ్, హనుమాన్ మందిరం–చెబుతు కట్ట ప్రాంతాల్లో అన్నదానం నిర్వహించనున్నారు.పెద్ద వీర హనుమాన్ మందిరం, భవాని మందిరం–డ్రై మార్కెట్, రాం మందిరం–పాత బస్టాండ్, దుర్గమ్మ గుడి–తాళ్లపల్లి రోడ్, హనుమాన్ మందిరం–సంతోష్‌నగర్, హనుమాన్ మందిరం–బాబా నగర్, జనవేశ్వర మందిరం–కట్టకమ్ము, దుర్గమ్మ గుడి–మహిళా ప్రాంగణం, పోచమ్మ గుడి–సంతోష్‌నగర్, హనుమాన్ మందిరం–రాజాంపేట్, హాస్పిటల్ గుడి, పంచముఖి హనుమాన్, సంగమేశ్వర దేవాలయం, హనుమాన్ మందిరం–కంది తదితర ప్రాంతాల్లో కూడా భక్తులకు అన్న ప్రసాదం అందించనున్నారు.ఈ సేవా కార్యక్రమాన్ని తోపాజీ అనంత కృష్ణ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు మ్యాడం రాధాకృష్ణ, కార్యదర్శి పుల్లారు ప్రకాశ్, ఉపాధ్యక్షులు చీకోటి దయాకర్, కోశాధికారి తోపాజీ హరీష్, కార్య నిర్వాహక కార్యదర్శి కట్కం విజయ్ కుమార్ సమన్వయంతో నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆయా ఆలయాలు, వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు, భక్తులు, సేవాభిలాషులు తమ వంతు సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు.
( Journalist – Rapaka VijayaRaju )
