మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌లో దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

అక్టోబర్ 7న సంగారెడ్డిలో మహాసభలు.. విజయవంతం చేయాలని పిలుపు

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 10 (V PRIME NEWS):

దళిత జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్ర 11వ మహాసభల పోస్టర్‌ను మహబూబ్‌నగర్‌లో సీనియర్ జర్నలిస్టులు ఆవిష్కరించారు. మహాసభలను విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించేందుకు కీలక వేదికగా నిలవనున్నాయని వారు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, యాదగిరి, తాటికొండ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగత్ ప్రకాష్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు కొమ్ము దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

( Journalist –  Rapaka VijayaRaju )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *