బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల భేటీ
కార్మిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై నేతల చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 2(V PRIME NEWS):

హైదరాబాద్, అక్టోబర్ 2(V PRIME NEWS): బస్ భవన్ వద్ద ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సంస్థకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ముకుంద రాజ్ రెడ్డి, మాజీ ఎంపీ వెంకుగోపాల్ ఆచారి, INTUC ఎన్నికల ఇన్చార్జ్ దొంతు రామ్మోహన్, TMU ప్రధాన కార్యదర్శి అశ్వత్ దామా రెడ్డి, SWU అధ్యక్షుడు కాకుల మల్లేష్, SWU చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పాకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
