సంగారెడ్డి

ఘనంగా ముగిసిన ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు!

రెండు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, అక్టోబర్ 4 (V PRIME NEWS):

సంగారెడ్డి, అక్టోబర్ 4 (V PRIME NEWS):
సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫాని దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు రెండు రోజులపాటు ఘనంగా జరిగాయి. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
మొదటి రోజు గంధం ఊరేగింపు, జాతీయ కవి సమ్మేళనం నిర్వహించగా.. రెండో రోజు దీపారాధన, అన్నదాన కార్యక్రమం, ఖవ్వాలి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

రెండో రోజు ఉర్సు కార్యక్రమాలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఉత్సవాలకు పూర్తిస్థాయిలో సహకరించిన పోలీసు సిబ్బంది, పత్రికా విలేకరులు, భక్తులు, నిర్వాహకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ పీఠాధిపతి ఉమర్ బిన్ అహ్మద్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న 25వ ఉర్సు ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పీఠాధిపతి ఉమర్ బిన్ అహ్మద్ తెలిపారు.

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *