దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు వాయిదా
మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సూచన మేరకు నిర్ణయం.. వచ్చే వారం సంగారెడ్డిలో మహాసభలు
సంగారెడ్డి, అక్టోబర్ 6 (V PRIME NEWS):

సంగారెడ్డి, అక్టోబర్ 6 (V PRIME NEWS):
ఈ నెల 7న నిర్వహించాల్సిన దళిత జర్నలిస్టుల ఫోరం (DJF) 11వ రాష్ట్ర మహాసభలను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఫోరం రాష్ట్ర నాయకులు తెలిపారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. డేవిడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామని అశోక్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల ముఖ్య నాయకులు సమావేశమై చర్చించిన అనంతరం మహాసభల తేదీని మార్చాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరు కావాల్సి ఉండగా, అదే తేదీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో వారు పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మంత్రుల సూచన మేరకు వచ్చే వారం సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలకు సంబంధించిన కార్యక్రమాలు, ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీలు, సభ్యులు ఈ తేదీ మార్పును గమనించి సహకరించాలని, మహాసభలను విజయవంతం చేయాలని ఫోరం నాయకులు కోరారు.
Journalist – Rapaka VijayaRaju
