హైదరాబాద్

జేబీఎస్–ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ బస్ చార్జీలు భారీగా తగ్గింపు

జేబీఎస్–రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం రూ.200.. తిరుగు ప్రయాణానికి రూ.300

హైదరాబాద్, అక్టోబర్ 6 (V PRIME NEWS):

హైదరాబాద్, అక్టోబర్ 6 (V PRIME NEWS):
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. పుష్పక్ ఏసీ బస్సు చార్జీలను తగ్గిస్తున్నట్లు కంటోన్మెంట్ డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 7, 2026 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి.

జేబీఎస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రస్తుతం రూ.350గా ఉన్న పుష్పక్ బస్ చార్జీని రూ.150 తగ్గించి కేవలం రూ.200కు నిర్ణయించారు. అదే విధంగా విమానాశ్రయం నుంచి జేబీఎస్‌కు ఉన్న రూ.400 చార్జీని రూ.100 తగ్గించి రూ.300కు తగ్గించారు.

ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా ప్రతి స్టేజీలో లోకల్ ప్రయాణికులకు ఇక జేబీఎస్ నుంచి మందమల్ల వరకు రూ.100, మెహిదీపట్నం వరకు రూ.100, ఆరాంఘర్ వరకు రూ.100 చార్జీతో ఏసీ పుష్పక్ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు మార్గమధ్యంలోని ప్రాంతాల ప్రజలకు కూడా తక్కువ చార్జీతో ఏసీ బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *