సంగారెడ్డి

ఘనంగా కొండాపురం జగన్ జన్మదిన వేడుకలు

పూలమాలలు, శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసిన నాయకులు.. పాల్గొన్న DJF రాష్ట్ర, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు

సంగారెడ్డి, అక్టోబర్ 08 (V PRIME NEWS):

సంగారెడ్డి, అక్టోబర్ 08 (V PRIME NEWS):
అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు, సంగారెడ్డి పట్టణ 3వ వార్డు కౌన్సిలర్, బీజేపీ నాయకులు కొండాపురం జగన్ జన్మదిన వేడుకలు సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండాపురం జగన్‌ను నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, నాయకులు శ్రీహరి, జెల్ల సురేష్, ప్రవీణ్, హనుమంతు, అఖిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండాపురం జగన్‌కు పలువురు నాయకులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జర్నలిస్ట్ – రాపాక విజయరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *