సంగారెడ్డి

సంగారెడ్డి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

కొత్త బోర్లు వేయాలి.. వాటర్ ట్యాంకర్ల సంఖ్య పెంచాలి

ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావుకు కౌన్సిలర్ కొండాపురం జగన్ వినతి

సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS): సంగారెడ్డి పట్టణంలో తీవ్రంగా మారుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిలర్ కొండాపురం జగన్ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావులను కోరారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన సందర్భంగా వారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ జగన్ మాట్లాడుతూ.. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డుల్లో సుమారు లక్ష మంది ప్రజలు నివసిస్తున్నారని, గత మూడు నెలలుగా తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మంజీరా, సింగూరు జలవనరుల్లో నీటి లభ్యత తగ్గడం వల్ల తాగునీటి సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణమంతటికీ కేవలం రెండు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం సరిపోవడం లేదని, దీనివల్ల అనేక ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

మున్సిపాలిటీ పరిధిలో సుమారు 460 బోర్లు ఉన్నప్పటికీ, వాటి మరమ్మతుల కోసం ఒకే మెకానిక్‌పై ఆధారపడటం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు.

పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయించాలని, వాటర్ ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని, బోర్ల మరమ్మతుల కోసం అదనపు సిబ్బందిని నియమించాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, సంగారెడ్డి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి, ఎంపీని కోరినట్లు కౌన్సిలర్ కొండాపురం జగన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *