సంగారెడ్డి

థ్రెడ్ ఆర్ట్‌తో మనసు గెలిచిన భవాని.. భూమి సమస్య పరిష్కారానికి జగ్గారెడ్డి హామీ

చదువు ఆగకూడదనే తపన.. జగ్గారెడ్డిని ఆశ్రయించిన విద్యార్థిని భవాని

సంగారెడ్డి, సెప్టెంబర్ 12, (V PRIME NEWS బ్యూరో):

12 ఏళ్లుగా భూమి వివాదం:
భవాని కుటుంబానికి ఉన్న రెండున్నర ఎకరాల భూమి గత 12 సంవత్సరాలుగా వివాదంలో ఉంది. రెవెన్యూ అధికారుల వద్ద సమస్య పెండింగ్‌లో ఉండటంతో ఆ భూమిని విక్రయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
పది రోజుల శ్రమతో థ్రెడ్ ఆర్ట్:
జగ్గారెడ్డిని కలిసే సమయంలో ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని భావించిన భవాని, ఇంటర్నెట్‌ ద్వారా థ్రెడ్ ఆర్ట్ తయారీని నేర్చుకుంది. అనంతరం పది రోజుల పాటు శ్రమించి జగ్గారెడ్డి చిత్రపటాన్ని స్వయంగా రూపొందించింది.


జగ్గారెడ్డికి చిత్రపటం బహూకరణ:
తన గ్రామానికి చెందిన పరిచయస్తుల సహకారంతో కాంగ్రెస్ నాయకులు చేర్యాల ఆంజనేయులు, చిమ్నాపూర్ ప్రకాష్, పాస్టర్ మోజెస్‌ను సంప్రదించిన భవాని.. వారి సహకారంతో తల్లిదండ్రులతో కలిసి జగ్గారెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా తాను రూపొందించిన థ్రెడ్ ఆర్ట్ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించింది.
భూమి సమస్య పరిష్కారానికి జగ్గారెడ్డి హామీ:
భవాని కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న జగ్గారెడ్డి.. భూమి సమస్యపై సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చదువు మధ్యలో ఆగిపోకుండా తన లక్ష్యాన్ని చేరుకోవాలని భవానిని ప్రోత్సహించారు.
బహుమతి వెనుక భవాని జీవిత కథ:
భవాని అందించిన థ్రెడ్ ఆర్ట్ ఒక చిత్రపటం మాత్రమే కాదు.. చదువుకోవాలనే తపన, కుటుంబాన్ని ఆదుకోవాలనే బాధ్యత, తన భవిష్యత్‌పై ఉన్న పట్టుదలకు ప్రతీకగా నిలిచింది.

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *