Telangana

పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్, అక్టోబర్ 10 (V PRIME NEWS):

వరంగల్, అక్టోబర్ 10 (V PRIME NEWS):పూలను పూజిస్తూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి, ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల పూల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎంపీ కడియం కావ్య ఆకాంక్షించారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆమె కోరుకున్నారు.

జర్నలిస్ట్ – రాపాక విజయరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *