మోదీ సేవా సంకల్ప్ అభియాన్‌లో.. సంగారెడ్డిలో అవయవదాన ప్రమాణం
కోణం విఠల్ ఆధ్వర్యంలో అవయవదాన ప్రమాణ కార్యక్రమం.. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్
సంగారెడ్డి, అక్టోబర్ 11 (V PRIME NEWS):

సంగారెడ్డి, అక్టోబర్ 11 (V PRIME NEWS):
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా, ఆయన ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో అవయవదాన ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా కోణం విఠల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అవయవదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, పాల్గొన్న వారితో అవయవదాన ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, జీఎస్ రాజశేఖర్ రెడ్డి, జీఎస్ మాణిక్ రావు, ఓబీసీ జిల్లా ఇన్‌చార్జ్ రామన్ సింగ్, జోనల్ ఇన్‌చార్జ్ నరసింహ, శ్రీనివాస్, మల్లేశం, సగుణకర్, పండరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అవయవదానం ద్వారా మరణానంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని, ప్రజల్లో అవయవదానంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జర్నలిస్ట్ – రాపాక విజయరాజు
