న్యూ ఢిల్లీ

నవంబర్ 1 నుంచి ఫోన్‌లో కాలర్ పేరు తప్పనిసరి!

తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా.. ఫోన్ స్క్రీన్‌పై పేరు కనిపించేలా కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (V PRIME NEWS):

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (V PRIME NEWS): మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పును తీసుకొస్తోంది. నవంబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా 4G, 5G వంటి నెట్‌వర్క్‌లలో వచ్చే కాల్స్‌కు ఫోన్ నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా కనిపించేలా టెలికాం సంస్థలకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సదుపాయాన్ని Calling Name Presentation (CNAP) అంటారు.

తెలియని నంబర్ల పేర్లు ఎలా కనిపిస్తాయి?
కాంటాక్ట్స్‌లో నంబర్ సేవ్ ఉంటే: ఫోన్‌లో సేవ్ చేసిన పేరే కనిపిస్తుంది.
సేవ్ చేయని భారతీయ నంబర్ నుంచి కాల్ వస్తే: టెలికాం సంస్థ రికార్డుల్లో నమోదైన పేరు కనిపిస్తుంది.
విదేశీ కాల్స్ వస్తే: ‘International Call’ అని చూపిస్తుంది.
సేవను విడిగా యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు: అర్హమైన నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయాన్ని డిఫాల్ట్‌గా అందించనున్నారు.

2G, 3G ఫోన్ల పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి ఈ సదుపాయం 4G, అంతకంటే ఆధునిక వైర్‌లెస్ నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది. 2G, 3G నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్‌లకు విస్తరించే అంశాన్ని తర్వాత పరిశీలించనున్నారు. కాలర్ పేరు కనిపించినంత మాత్రాన ఆ కాల్ పూర్తిగా సురక్షితమైనదని భావించకూడదు. మోసగాళ్ల కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

V PRIME NEWS — ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా!

జర్నలిస్ట్ – రాపాక విజయరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *