సంగారెడ్డి

సంగారెడ్డిలో తాగునీటి కష్టాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు!

మంజీరా నీటి సరఫరాలో ముందస్తు ప్రణాళిక ఏదీ? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు బీజేపీ నేత కొండాపురం జగన్ విజ్ఞప్తి

సంగారెడ్డి, అక్టోబర్ 18 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 18 (V PRIME NEWS):
సంగారెడ్డి పట్టణ ప్రజలకు మంజీరా తాగునీటిని అందించడంలో అధికారులు విఫలమయ్యారని మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ ఆరోపించారు. పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోతుండటంతో మంజీరా నీటి సరఫరాపై ప్రభావం పడే పరిస్థితి ఉన్నప్పటికీ, అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం బాధాకరమని జగన్ పేర్కొన్నారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

బోర్లు వేయించి.. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి
సంగారెడ్డి పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కొండాపురం జగన్ కోరారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు వేయించాలని, నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించేందుకు యంత్రాంగం తక్షణమే స్పందించి, శాశ్వత పరిష్కారంతో పాటు తాత్కాలిక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

V PRIME NEWS | ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా!

జర్నలిస్ట్ – రాపాక విజయరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *