సంగారెడ్డి

సంగారెడ్డిలో అక్రమ బోర్‌వెల్ తవ్వకాలపై ఉక్కుపాదం!

అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక

సంగారెడ్డి, అక్టోబర్ 30 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 30 (V PRIME NEWS): పట్టణంలో అనుమతి లేకుండా చేపడుతున్న బోర్‌వెల్ తవ్వకాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. గురువారం సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని తారా డిగ్రీ కళాశాల సమీపంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న బోర్‌వెల్ వాహనాన్ని అధికారులు అడ్డుకొని, దాన్ని సీజ్ చేశారు. జప్తు చేసిన వాహనాన్ని తదుపరి విచారణ, చర్యల కోసం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ మెరుపు తనిఖీల్లో అడిషనల్ కలెక్టర్ పాండు, ఎమ్మార్వో జయరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఐ రామనాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

పట్టణ పరిధిలో నిబంధనలు పక్కనబెట్టి బోర్‌వెల్లు తవ్వితే సహించేది లేదని అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండా పనులు చేపడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

V PRIME NEWS | ప్రజల కోసం… ప్రజల గొంతుక!

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *