కొత్తకోటలో దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
వ్యవస్థాపకులు కాశపోగు జాన్ ఆధ్వర్యంలో ఎస్సైలు విక్రమ్, భాస్కర్ నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ

కొత్తకోట, సెప్టెంబర్ 12, V PRIME NEWS: వచ్చే నెల 07వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కొత్తకోటలో ఆవిష్కరించారు. దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి ధనుష్తో కలిసి కొత్తకోట ఎస్సై విక్రమ్, ఎస్సై-2 భాస్కర్ నాయుడు చేతుల మీదుగా వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, వృత్తిపరమైన అంశాలపై రాష్ట్ర మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దళిత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మునగారి కృష్ణ, మాజీ కో ఆప్షన్ సభ్యులు మిషేక్, కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు మేస్త్రి శ్రీను, సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్, దిశ రమేష్, బాలరాజు, లక్ష్మణ్, దాసు తదితరులు పాల్గొన్నారు.
