సౌరశక్తితో విద్యుత్ బిల్లులకు విముక్తి..!
పీఎం సూర్యఘర్ యోజనతో పఠాన్‌చెరు ప్రజలకు ప్రయోజనాలు – బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
పటాన్ చెరువు, అక్టోబర్ 08 (V PRIME NEWS):

పటాన్ చెరువు, అక్టోబర్ 08 (V PRIME NEWS): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్: ఉచిత విద్యుత్ యోజన’ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పఠాన్‌చెరు నియోజకవర్గంలో సోలార్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలిశారు. ఈ సందర్భంగా సోలార్ విద్యుత్ ద్వారా వారు పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని గోదావరి అంజిరెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావడంతో వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించడం ద్వారా అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, హరిత ఇంధన వినియోగానికి కూడా ఎంతో దోహదపడుతుందని తెలిపారు.
ప్రతి కుటుంబం పీఎం సూర్యఘర్ యోజనను సద్వినియోగం చేసుకుని సౌరశక్తి వైపు అడుగులు వేయాలని గోదావరి అంజిరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, బీజేపీ నాయకులు నందరెడ్డి, రఘు, రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
Journalist – Rapaka VijayaRaju
