జహీరాబాద్

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా జహీరాబాద్‌లో భారీ రాస్తారోకో

రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ జాతీయ రహదారి 161పై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

జహీరాబాద్, అక్టోబర్ 08 (V PRIME NEWS)

జహీరాబాద్, అక్టోబర్ 08 (V PRIME NEWS): ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జహీరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం భారీ ఆందోళన చేపట్టారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి 161పై జహీరాబాద్ టౌన్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ వైస్ ఎంపీపీ రాములు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి మల్లికార్జున్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, నరేష్ బబ్లూ, అసెంబ్లీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, ధర్ము నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కిరణ్‌కుమార్ గౌడ్, రాఘవేందర్, సీడీసీ డైరెక్టర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు నాయక్, సంతోష్‌రెడ్డి, జహీర్ అరబ్బీ, రాంచంద్రారెడ్డి, అక్షయ్ జాడే, నవీద్, కుమ్మరి రాజు, రఘుపతి, లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్తర్ గోరి, ఇమామ్ పటేల్, నర్సింహారెడ్డి, సోమప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *