సంగారెడ్డి

ఉచిత పోలీస్ కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్‌కు భారీ స్పందన

1,485 మంది అభ్యర్థుల హాజరు.. మూడు కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

సంగారెడ్డి, అక్టోబర్ 11 (V PRIME NEWS):

సంగారెడ్డి, అక్టోబర్ 11 (V PRIME NEWS):
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాతిక్ జైన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది.
జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్ కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 1,485 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సంగారెడ్డిలో 765, అందోల్‌లో 265, జహీరాబాద్‌లో 455 మంది పరీక్ష రాశారు.
ఎంపికైన అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధనతో పాటు పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన శారీరక శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *