సంగారెడ్డి

టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడు యాదవ రెడ్డికి టీయూడబ్ల్యూజే నేతల సన్మానం

సంగారెడ్డి, నవంబర్ 1 (V PRIME NEWS): సంగారెడ్డి టీఎన్జీవో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన యాదవ రెడ్డిని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జర్నలిస్టు సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం సంగారెడ్డి డీపీఆర్వో కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో జర్నలిస్టులు యాదవ రెడ్డికి పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకులు మాట్లాడుతూ.. యాదవ రెడ్డి జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. టీఎన్జీవో సంఘం అభివృద్ధి కోసం సేవా దృక్పథంతో పనిచేస్తూ, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్, సంఘ నాయకులు మతీన్, మసూద్, రఫిక్ నూరి, సత్తార్, రఫీ, ముజాహిద్, సత్యనారాయణ రెడ్డి, సిద్ధూ, శ్రీనివాస్, మహబూబ్ గౌరీ, షంషుద్దీన్, నాథిఖ్ తదితరులు పాల్గొన్నారు.

V PRIME NEWS | ప్రజల కోసం… ప్రజల గొంతుక!

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *