సంగారెడ్డి

సంగారెడ్డి పట్టణ ప్రజల నీటి అవసరాల కోసం కొండాపురం జగన్ ప్రత్యేక చొరవ!

సింగూరు నుంచి 0.5 టీఎంసీల నీటి విడుదలకు కృషి

మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రతీక్ జైన్‌లకు కౌన్సిలర్ కొండాపురం జగన్ కృతజ్ఞతలు

సంగారెడ్డి, నవంబర్ 01 (V PRIME NEWS)

సంగారెడ్డి, నవంబర్ 01 (V PRIME NEWS): సంగారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగూరు ప్రాజెక్టు నుంచి 0.5 టీఎంసీల నీటిని మంజీరా డ్యాంకు విడుదల చేయించేందుకు సహకరించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌లకు 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ నాయకుడు కొండాపురం జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల తాగునీటి అవసరాలపై ప్రత్యేక చొరవ

సంగారెడ్డి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి సానుకూలంగా స్పందించిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం చొరవ అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సింగూరు నుంచి 0.5 టీఎంసీల నీటిని మంజీరా డ్యాంకు విడుదల చేయించడం పట్టణ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని అన్నారు.

నీటి ప్రతి బొట్టును కాపాడుకోవాలి

ఈ సందర్భంగా కొండాపురం జగన్ మాట్లాడుతూ.. నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని, ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇంట్లో కుళాయిల ద్వారా నీరు వృథా కాకుండా చూసుకోవాలని, నీటి లీకేజీలను వెంటనే అరికట్టాలని, అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని కోరారు.

నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరం

వాహనాలు, ఇళ్ల శుభ్రత వంటి పనుల్లో నీటిని అనవసరంగా వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల నీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే నీటి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప్రజల సమస్యే నా సమస్య.. పరిష్కారమే నా లక్ష్యం

ఈ సందర్భంగా కొండాపురం జగన్ మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. సంగారెడ్డి పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత మంత్రులు, అధికారులను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. ప్రజల అవసరాల కోసం ఎవరిని కలవడానికైనా, ఎంతటి సమస్యనైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికైనా తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.

V PRIME NEWS | ప్రజల కోసం… ప్రజల గొంతుక!

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *