పటాన్ చెరువు

చిన్నకంజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఆర్

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభం.. రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన.

పటాన్‌చెరు, నవంబర్ 03 | V PRIME NEWS రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, దళారుల బెడద లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.

ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

రైతులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా

కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తరఫున కల్పిస్తున్న సౌకర్యాలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే గోదాములకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు.

దళారులకు ధాన్యం విక్రయించవద్దు

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని కోరారు.

అదేవిధంగా రైతులకు చెల్లించాల్సిన బోనస్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ ప్రమీల, డీసీసీబీ డైరెక్టర్ రాఘవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, శ్రీనివాస్, రామచందర్, వెంకటేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్లు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

— V PRIME NEWS

Journalist – Rapaka VijayaRaju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *