న్యూ ఢిల్లీ

🚨 ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్, ప్రియాంక సహా INDIA కూటమి ఎంపీల అరెస్ట్!

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, SIR రద్దు డిమాండ్.. ఆకాశవాణి భవన్‌ వద్ద నిరసనలతో ఉద్రిక్తత

న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (V PRIME NEWS):
దేశ రాజధాని ఢిల్లీలో INDIA కూటమి ఎంపీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై నిరసన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఆందోళనలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టారు. అయితే న్యూఢిల్లీలోని నితి ఆయోగ్‌ సమీపంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పలువురు ఎంపీలను పోలీసులు బస్సుల్లోకి ఎక్కించి వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు తాజా సమాచారం. పోలీసులు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాహుల్‌, ప్రియాంక ఆకాశవాణి భవన్‌ వద్ద నిరసనను కొనసాగించేందుకు ప్రయత్నించారు.

పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్‌, ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు నేతలు ఆకాశవాణి భవన్‌ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడే బైఠాయించారు.

దాదాపు పలు గంటల పాటు ఆందోళన కొనసాగిన అనంతరం పోలీసులు మళ్లీ రంగంలోకి దిగి రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా నిరసనలో ఉన్న నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సుల్లో తరలించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *