న్యూ ఢిల్లీ

గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.7,395.55 కోట్లతో కొత్త పథకం!

కేంద్ర కేబినెట్‌ ‘ప్రధానమంత్రి వికసిత్‌ గ్రామ స్వరాజ్‌ యోజన’కు ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2030–31 వరకు అమలు చేయనున్న ఈ పథకానికి రూ.7,395.55 కోట్లు కేటాయించింది. సుమారు 32 లక్షల మంది ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందికి ప్రయోజనం చేకూరనుండగా, గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు, శిక్షణ, పారదర్శక ఆడిటింగ్‌, పంచాయతీల సొంత ఆదాయ పెంపునకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

Read More
న్యూ ఢిల్లీ

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కొత్త నిబంధనలు.. జనవరి 1 నుంచి అమల్లోకి!

2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఈ-కామర్స్‌ నిబంధనల ప్రకారం, డిస్కౌంట్‌ ప్రకటించినప్పుడు గత 30 రోజుల్లోని అత్యల్ప ధరను కూడా వెల్లడించాలి. సెర్చ్‌ ఫలితాలు, స్పాన్సర్డ్‌ ప్రకటనలు, విక్రేతల వివరాలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలోనూ పారదర్శకతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

Read More
హైదరాబాద్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మూడు సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణలో టీజీపీఎస్‌సీ ద్వారా 102 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్‌సీ ద్వారా 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీబీపీలో స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లు పరిశీలించి గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.

Read More
రాయిపోల్

సిద్దిపేట జిల్లాలో మహిళా ఖోఖో క్రీడా సంబరం.. నవంబర్ 1న ‘ఖేలో ఇండియా అస్మిత’ టోర్నమెంట్!

సిద్దిపేట జిల్లా రాయిపోల్‌లో నవంబర్ 1న ఖేలో ఇండియా అస్మిత 2026–27 మహిళల సీనియర్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహించనున్నారు. యూనిఫైడ్ మెదక్ డిస్ట్రిక్ట్ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు అక్టోబర్ 31 వరకు ఎంట్రీలు స్వీకరిస్తారు. వివరాలకు 9963770406 నంబర్‌ను సంప్రదించండి.

Read More
జహీరాబాద్

జహీరాబాద్‌లో మూడు రోజుల పాటు లక్షబిల్వార్చన, అయ్యాచార దీక్షల మహోత్సవం

జహీరాబాద్‌లోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు శ్రీశ్రీశ్రీ 1008 ఉజ్జయిని జగద్గురువుల ఆశీస్సులతో లక్షబిల్వార్చన, అయ్యాచార దీక్షల మహోత్సవం నిర్వహించనున్నారు. గోమాత పూజ, ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రథోత్సవం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. శివభక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Read More
సంగారెడ్డి

ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వ ప్రచారానికే ప్రాధాన్యత: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వ ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు, అసైన్డ్ భూముల హక్కులు, బలవంతపు భూసేకరణ, కరువు నివారణ, సింగూరు ప్రాజెక్టు నీటి నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read More
హైదరాబాద్

తెలంగాణను కమ్మేసిన కరువు మేఘాలు!

తెలంగాణలో కరువు తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించగా, 111 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంది. సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో రైతులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Read More
సంగారెడ్డి

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 32 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

Read More
సంగారెడ్డి

ప్రతి భూ యజమానికి ‘భూదార్’.. ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య

తెలంగాణలో ప్రతి భూ యజమానికి ‘భూదార్’ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడంతో పాటు ఉపగ్రహ చిత్రాలతో కూడిన భూ పటాలను పట్టాదారు పాస్ పుస్తకాల్లో పొందుపరచనున్నట్లు మంత్రులు తెలిపారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే చేపట్టనుండగా, మిగిలిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను 15 రోజుల్లో కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు రెండో పంట సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Read More
పటాన్ చెరువు

కేసీఆర్‌తో పటాన్‌చెరు ఎమ్మెల్యే జీఎంఆర్‌ భేటీ

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో జరగనున్న తన సోదరుడి కుమారుడు సందీప్‌రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించడంతో పాటు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Read More